Sanantha Vijay devarakonda Khushi | టాలీవుడ్ హాట్ బ్యూటీ సమంత, యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ జంటగా ‘ఖుషి’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కాశ్మీర్ లో జరుగుతుంది. పహల్గామ్ ప్రాంతంలో ఓ సన్నివేశం చిత్రీకరణలో సమంత, విజయ్ దేవరకొండ గాయపడినట్టు సమాచారం అందుతుంది. నది పై కట్టిన రోప్ వే పై కారులో వెళ్లే సన్నివేశం చిత్రీకరిస్తుండగా కార్ నదిలో పడిపోయిందని, ఆ కార్ లో ఉన్న సమంత, విజయ్ దేవరకొండ లను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని, హిందూస్తాన్ టైమ్స్ ప్రచురించింది. మనకందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయని, సంఘటన జరిగిన వెంటనే హోటల్ కు తలరించి డాక్టర్ ని పిలిచారని, పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలుస్తుంది. ఈ సంఘటనలో నిజానిజాలతో సహా పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది.
https://twitter.com/Samanthaprabhu2/status/1526049835069362177