బాలీవుడ్ కి భారీ షాకిచ్చిన మరో నాని సినిమా

Nikamma MCA
Nikamma MCA

Nikamma MCA | గత కొంతకాలం నుంచి బాలీవుడ్ పై టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ ల ఆధిపత్యం కొనసాగుతుంది. చాలాకాలం నుంచి కూడా తెలుగు సినిమాలు హిందీలో రీమేక్ చేయటం జరుగుతూనే ఉంది. ఈ మధ్యే నాని జెర్సీ సినిమా హిందీలో షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ చేస్తే బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. ఇక తాజాగా మరో నాని సినిమా ‘MCA ‘ హిందీలో నికమ్మ పేరుతొ రీమేక్ చేసారు. ఈ సినిమా కూడా భారీ డిజాస్టర్ దిశగా పరుగులు పెడుతుంది. అసలీ సినిమా తెలుగులోనే ప్లాప్ అనీ, ఇలాంటి సినిమా రీమేక్ చేయటమేంటి అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. తెలుగులో భూమిక నటించిన పాత్రలో శిల్ప శెట్టి బాగానే న్యాయం చేసింది.