Deepika Padukone hot bold | పెద్ద చిన్న, టాలీవుడ్ బాలీవుడ్ అని తేడా లేకుండా నటీమణులంతా ఎదో ఒక సమయంలో ట్రోలింగ్ కి గురి కావటం సహజం. అన్నిటికంటే ముఖ్యంగా బాడీ షేమింగ్ కి కూడా గురైన స్టార్ హీరోయిన్లు చాలా మండే ఉన్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె తనకెదురైన బాడీ షేమింగ్ సంఘటనను మీడియా తో పంచుకుంది. దీపికా నటించిన తాజా చిత్రం గెహరాయియాన్ ఈమధ్యే ఒటిటి లో విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుసగా మీడియా ఇంటర్వ్యూ లలో పాల్గొంటుంది దీపికా పదుకొనె.
ఇందులో భాగంగా ఓ విలేఖరి ‘మీకెదురైన అతి చెత్త సలహా ఏది?’ అని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పింది దీపికా. తన వక్షోజాల సైజు తక్కువగా ఉందని, పెంచుకోమంటూ (బ్రెస్ట్ ఇంప్లాంట్ సర్జరీ ద్వారా) ఓ వ్యక్తి తనకు టీనేజ్ లోనే సలహా ఇచ్చాడని, అదే తనకెదురైన అత్యంత చెత్త సలహా అంటూ చెప్పుకొచ్చింది దీపిక. ఆ టైమ్ లో తనకు చాలా కోపం వచ్చిందని, అయితే ఆ విషయాన్నీ చాలా త్వరగా మరిచిపోయానని చెప్పుకొచ్చింది దీపికా పదుకొనె.