Khushbu Sundar casting couch |. ముంబై పాప ఖుష్బూ (నఖత్ ఖాన్) చిన్న వయసులోనే ‘ది బర్నింగ్ ట్రైన్’ అనే బాలీవుడ్ సినిమాలో ఓ పాటతో తెరంగేట్రం చేసింది. అదే బాలీవుడ్ లో జాకీ ష్రాఫ్ సరసన ‘జానూ’ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. వెంకటేష్ డెబ్యూ మూవీ ‘కలియుగ పాండవులు’ తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత తమిళ్ లో కూడా ఎంట్రీ ఇచ్చి అక్కడే స్టైల్ అయిపొయింది ఖుష్బూ. కొంచెం లావెక్కటం తో తెలుగులో అవకాశాలు తగ్గినా, కోలీవుడ్ లో మాత్రం అమ్మడికి గుడి కట్టేసారు. కోలీవుడ్ డైరెక్టర్ సుందర్.సి ని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఖుష్బూ.
ప్రస్తుతం ఖుష్బూ అడపాదడపా సినిమాల్లో కనిపిస్తున్నా ఎక్కువగా రాజకీయాల మీదే శ్రద్ధ చూపిస్తున్నారు. తాజాగా జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి తరపున 1000 లైట్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై స్పందించింది. కలియుగ పాండవులు షూటింగ్ టైం లో ఒకడు వెనక చేత్తో తడిమితే చెంప పగలగొట్టానని, ఆ టైం లో అక్కడే ఉన్న సురేష్ బాబు కూడా ఆమెనే సపోర్ట్ చేసాడని చెప్పింది ఖుష్బూ. అలాగే ఓ స్టార్ హీరో దగ్గర కమిట్మెంట్ మాట విన్నానని, ‘నీ కూతురుని మా తమ్ముడి గదికి పంపితే నేను కూడా ఒప్పుకుంటాను’ అని గట్టిగా సమాధానం చెప్పానని అంటోంది. ఇంతకీ ఖుష్బూ పేరు చెప్పని ఆ స్టార్ హీరో ఎవరో?