Mandana Karimi Casting Couch | బాలీవుడ్ ఇటాలియన్ నటి మందన కరిమి తన సొంత నిర్మాతపై మరోసారి వధించాడంటూ ఆరోపణలు చేసింది. ఆమెకు ఇలాంటి ఆరోపణలు చేయటం కొత్త కాకపోయినా, ఈసారి కొత్తగా చేసింది. దీపావళి ముందు రోజు షూటింగ్ అనంతరం వన్ లో బట్టలు మార్చుకుంటుంటే నిర్మాత మహేంద్ర ధరివాల్ డోర్ తోసుకుని లోపలకొచ్చి అరిచాడని, బట్టలు మార్చుకుని వస్తానని చెప్పినా, వినలేదని ఈ అమ్మడు ఆరోపణ చేసింది. వివరాల్లోకి వెళితే..
మహేంద్ర ధరివాల్ నిర్మాతగా బాలీవుడ్ లో తెరకెక్కుతున్న ;కోకోకోలా’ సినిమాలో నటించింది ఈ హాట్ భామ. షూటింగ్ చివరి రోజు టైం అవగానే వన్ లోకి వెళ్లిపోయిందని, ఒక గంట షూటింగ్ చేస్తే ఆమె పార్ట్ కంప్లీట్ అవుతుందని బతిమిలాడినా వినలేదని, నిర్మాత సైడ్ నుంచి స్టోరీ వినిపిస్తోంది. విశేషమేమిటంటే, ఈమెతో గతంలో పని చేసిన దర్శక నిర్మాతలు కూడా ఈమె ప్రవర్తన పై ఇలాంటి అభిప్రాయాలని వెలిబుచ్చటం.