సాయి పల్లవి అడ్రస్ కూడా లేదుగా

Natural beauty Sai pallavi waiting for roles like Malar from Premam
Natural beauty Sai pallavi waiting for roles like Malar from Premam

Natural beauty Sai pallavi waiting for roles like Malar from Premam | నాచ్యురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai pallavi) సినిమాల్లో ఎంట్రీ ఇవ్వక ముందే తనలోని డాన్స్ టాలెంట్ ప్రూవ్ చేసుకున్న విషయం తెలిసిందే. మలయాళం లో ప్రేమమ్ (Premam) సినిమా తో మలర్ (Malar) అనే సాఫ్ట్ క్యారెక్టర్ తో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది సాయి పల్లవి. అలాగే అనుపమ పరమేశ్వరన్ కూడా అదే ప్రేమమ్ (Premam) సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అనుపమ అతి కొద్ది కాలం లోనే ఎక్కువ సినిమాల్లో నటించి, ప్రస్తుతం షాప్ ఓపెనింగ్స్ లతో కూడా బిజీ అయిపొయింది. సాయి పల్లవి (Sai pallavi) ఫిదా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకుంది. అయితే తన క్యారెక్టర్ నచ్చితేనే సినిమా చేస్తాను అనే సాయి పల్లవి చేతిలో ప్రస్తుతం ఒక్కటంటే ఒక్క సినిమా కూడా లేదంటే నమ్మలేము.

ఎప్పుడో పూర్తయి విడుదల వాయిదా పడుతూ వచ్చిన విరాట పర్వం మినహా మరో సినిమాలో సాయి పల్లవి ఇప్పట్లో కనిపించే అవకాశం లేదు. ప్రేమమ్ లో మలర్ (Malar) లాంటి పాత్ర కోసం ఎదురు చేస్తే ఇండస్ట్రీ లో నిలదొక్కుకోవడం కష్టమే. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో చెల్లెలి పాత్రకు అవకాశం వచ్చినా నో చెప్పింది. అయితే అది రీమేక్ సినిమా కనుక నో చెప్పానని తరువాత క్లారిటీ ఇచ్చింది. స్కిన్ షో చేయను, క్యారెక్టర్ కి ప్రాముఖ్యత ఉండాలి అని గిరి గీసుకు కూర్చుంటే తెరమరుగవటానికి ఎంతోకాలం పట్టకపోవచ్చు.

Natural beauty Sai pallavi waiting for roles like Malar from Premam