సెక్సువల్ హరాన్స్మెంట్ కేసు … పరారీలో నిర్మాత

Producer Vijay babu booked for revealing identity in sexual harassment case | మలయాళ నిర్మాత, నటుడు విజయ్ బాబు (Vijay babu) పై సెక్సువల్ హర్రన్స్మెంట్ కేసు నమోదు చేసింది ఓ నటి. అవకాశాలు ఇస్తానని నమ్మించి ఎన్నోసార్లు సెక్సువల్ గా అబ్యూజ్ చేశాడంటూ విజయ్ బాబు పై ఓ మలయాళ నటి ఏప్రిల్ 22 న కొచ్చి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కాస్టింగ్ కౌచ్ అంశం గతంలో ఓ ఉద్యమంలా ఉవ్వెత్తున ఎగసి, అంతే స్పీడ్ గా చల్లారి పోయిన విషయం తెలిసిందే. ఇటువంటి కేసుల్లో లీగల్ గా ముందుకెళ్లిన నటి పేరును గోప్యంగా ఉంచుతారు. అయితే మొన్న రాత్రి పేస్ బుక్ లైవ్ లో ఆ నటి పేరును ప్రస్తావించినందుకు గాను, విజయ్ బాబు(Vijay babu) పై మరో కేసు నమోదైంది.

ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లు 376 , 323 , 506 మరియు 228A కింద విజయ్ బాబు(Vijay babu) పై కేసులు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం విజయ్ బాబు పరారీలో ఉన్నట్టు సమాచారం.

Producer Vijay babu booked for revealing identity in sexual harassment case