స్టార్ డైరెక్టర్ పై మీటూ ఆరోపణలు చేస్తున్న మరో హీరోయిన్

Sherlyn chopra casting couch | బాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఒక ఉద్యమంలా మొదలై అంతే స్పీడ్ గా సద్దుమణిగిపోయింది. దీనికి ముఖ్య కారణం ఎక్కువమంది చేసే ఆరోపణలు వ్యక్తిగత ప్రయోజనాల కోసమే కావటం. ఇలాంటివారి వల్ల నిజమైన ఆరోపణలు కూడా నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. మీటు ఉదయం బాగా ఊపు మీద వున్నప్పుడే స్టార్ డైరెక్టర్ సాజిద్ ఖాన్ పై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో రియాక్షన్ కూడా అంతే ఫాస్ట్ గా వుంది. షూటింగ్ దశలో ఉన్న భారీ ప్రాజెక్ట్ హౌసేఫుల్ 4 నుంచి సాజిద్ ఖాన్ ను తప్పించారు.

ఈమధ్యే ఒక నాలుగు రోజుల క్రితం జియా ఖాన్ సోదరి కూడా సాజిద్ ఖాన్ పై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా షెర్లిన్ చోప్రా 2005 లో తనతో సాజిద్ ఖాన్ మిస్ బిహేవ్ చుసాడంటూ ఆరోపణలు చేస్తోంది. ఇలాంటి ఆరోపణల్లో అత్యధిక శాతం పబ్లిసిటీ కోసమే చేస్తున్నా, ఒకే వ్యక్తి మీద ఇంత మంది ఆరోపణలు చేస్తుండటం ఆలోచించదగ్గ విషయమే.

Sherlyn chopra casting couch