chinmayi sripada casting couch | చిన్మయి శ్రీపాద .. ఈపేరు బహుశా ఈపాటికే అందరికి తెలిసి ఉంటుంది. సమంత లాంటి ఎంతో మంది స్టార్ నటీమణులకు గొంతు అరువిచ్చిన స్టార్ డబ్బింగ్ ఆర్టిస్ట్, సింగర్. అయితే ఇలా ఎవరికీ తెలియకపోయినా, ఆమె చేసే కాంట్రవర్సీ లతో పబ్లిసిటీ స్టంట్ లతో దేశమంతా బాగా పాపులర్ అయిపొయింది. తాజాగా మరోసారి అమ్మడి పేరు బాగా వినిపిస్తుంది. ఈసారి సమాజ సేవా కార్యక్రమంలో చిన్మయి పేరు వినిపించటం విశేషం. అవసరాల్లో ఉన్న వారిని ఆదుకోవటానికి అమ్మడు సాంగ్స్ రికార్డు చేసి విరాళాలు సేకరిస్తుంది. పైగా ఆ విరాళాలు నేరుగా అవసరం ఉన్న వారి ఖాతాకే చేరేటట్టుగా ఏర్పాట్లు చేసింది.
ఇంతమంచి పని చేస్తున్న చిన్మయిని అందరు అభినందించాల్సిందే. అందుకే అనుకుంట గూగుల్ లో ఫ్యాన్స్ చిన్మయిని బాగా వెదికేసారు. ఈ వార్తతో పాటు గూగుల్ పుణ్యమా అని మరో వార్త కూడా బాగానే చక్కర్లు కొడుతోంది. ఇది చాలా పాత విషయమే అయినా మరోమారు కొత్తగా చూస్తున్నారు జనం. కొంత కాలం క్రితం ఫ్యాన్స్ చిన్మయిని చీర కట్టవచ్చుగా అని అడిగిన ప్రశ్నకు కొంత ఘాటుగా సమాధానమిచ్చింది. చీర కట్టుకుంటే సైడ్ నుంచి ఫోటోలు తీస్తున్నారని, పైగా అవి చూస్తూ హస్తప్రయోగం చేసుకుంటున్నామని ఆమెకే మెస్సేజులు పెడుతున్నారని చెప్పి సంచలనం సృష్టించింది. మీరూ ఓ లుక్ వేయండి.
When I wear a sari there are groups of men who take photographs of my waist + side of my chest, circle it and upload it on soft porn websites. And then I get messages on how they are masturbating to it.
I can be Indian in a sari and in jeans, Sir. https://t.co/94Ctcsa361
— Chinmayi Sripaada (@Chinmayi) January 28, 2019