షాకింగ్ .. హీరో ఒంటరిగా కలవమన్నాడట

isha koppikar casting couch | ఒక జమానాలో మరాఠీ పాప ఇషా కొప్పికర్ సౌత్ లో కూడా చక్రం తిప్పింది. బాలీవుడ్ తో పాటు తెలుగు, కన్నడ, తమిళ,మరాఠీ భాషల్లోనూ నటించింది. టాలీవుడ్ లో నాగార్జున సరసన చంద్రలేఖ సినిమాలో మెప్పించింది ఇషా కొప్పికర్. అలాగే విక్టరీ వెంకటేష్ తో ‘ప్రేమతో రా’ సినిమాలో కూడా కనిపించింది. అయితే ఎందుకో ఆ తరువాత టాలీవుడ్ లో పెద్దగా కనిపించలేదు. ఇప్పటికీ అడపాదడపా బాలీవుడ్ సినిమాలు చేస్తూనే వెబ్ సిరీస్ లలో కూడా బిజీ అయిపొయింది ఇస్హాకొప్పికర్. తాజాగా దహనం అనే తమిళ వెబ్ సిరీస్ లో కనిపించింది ఇషా కొప్పికర్. ఇక అసలు విషయానికి వస్తే….

ఒక తాజా ఇంటర్వ్యూ లో ఇషా కొప్పికర్ గతంలో జరిగిన ఓ ఇన్సిడెంట్ ను బయట పెట్టింది. ఒక బడా హీరోతో సినిమా కన్ఫర్మ్ అయ్యాక హీరో ఒంటరిగా కాలవ మన్నాడట. అయితే హీరో ఉద్దేశ్యం తెలుసుకుని కలవడానికి నిరాకరించిందట ఇషా కొప్పికర్. ఆ కారణం గా సినిమా కోల్పోయానని, ఇప్పటికీ ఆ సంఘటన బాధ కలిగిస్తుందని చెపుతుంది ఇషా. అంతా బాగానే ఉంది కానీ, ఆయనెవరో పేరు బయట పెట్టనప్పుడు అసలీ విషయం బయటపెట్టటం అవసరమా..

isha koppikar casting couch