సింగర్ సునీత మామిడి కాయల వెనుక రహస్యం ఏమీ లేదట

Singer Sunitha | సెలెబ్రిటీలు ఏమీ చేసినా అది ఓ వార్తే. పైగా ఈ సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత ర్యూమర్లు శరవేగంగా స్ప్రెడ్ అయిపోతున్నాయి. సింగర్ సునీత ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. పైగా ఆమెకు టాలీవుడ్ లో ఫ్యాన్స్, సోషల్ మీడియా ఫాలోయర్స్ బాగా ఎక్కువ. తాజాగా సునీత మామిడి కాయల చెట్టు పక్కన నిలపడి ఫోటో పోస్ట్ చేసింది. పైగా బ్లెస్సెడ్ అని కాప్షన్ పెట్టటంతో ర్యూమర్లు మొదలయ్యాయి. ఈమధ్యే రెండో పెళ్లి చేసుకున్న సునీత తల్లి కాబోతుందని, అందుకే సింబాలిక్ గా ఆ పోస్ట్ పెట్టిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరికొందరయితే ఏకంగా సునీతకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. వెంటనే స్పందించిన సునీత అలాంటిదేమి లేదని, ఇలాంటి వార్తలు ప్రచారం చేయద్దని దండం పెడుతూ మరో ట్వీట్ చేసింది.

Singer Sunitha 2
Singer Sunitha 2

Singer Sunitha