ఇన్నాళ్లకు మొదటి హిట్టు కొట్టినా లాభం లేదాయె

London beauty Rukshar Dhillon scores 1 st hit
London beauty Rukshar Dhillon scores 1 st hit

London beauty Rukshar Dhillon scores 1 st hit | లండన్ బ్యూటీ రుక్షర్ దిల్లోన్ ఆరేళ్ళ క్రితం ‘రన్ ఆంటోనీ’ అనే కన్నడ సినిమాతో తెరంగేట్రం చేసింది. తరువాతి సంవత్సరమే ‘ఆకతాయి’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేసింది. నాని హీరోగా నటించిన ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రుక్షర్ కు నిరాశే ఎదురైంది. మలయాళం లో సూపర్ హిట్ అయిన ‘ఎబిసిడి’ రీమేక్ సైతం అమ్మడికి హిట్ అందించలేకపోయింది. రెండేళ్ల క్రితం ‘భాంగ్రా పాలే’ అనే హిందీ సినిమాతో బాలీవుడ్ డెబ్యూ చేస్తే అది కూడా అడ్రస్ లేకుండా పోయింది. ఎట్టకేలకు తాజాగా విడుదలైన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమాతో అమ్మడు టాలీవుడ్ లో మొదటి హిట్ కొట్టింది. అయితే ….

విశ్వక్ సేన్, రుక్సార్ థిల్లోన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిన్నటివరకు సినిమాలో రుక్సార్ థిల్లోన్ హీరోయిన్ అనుకున్నారు అంతా. అయితే సినిమాలో మరో హీరోయిన్ ‘రితిక నాయక్’ ఉన్న విషయాన్ని చిత్ర యూనిట్ దాచిపెట్టింది. హీరోయిన్ కి చెల్లెలిగా సాదాసీదాగా సినిమా మొదట్లో కనిపించే రితిక నాయక్, చివరికి వచ్చేసరికి మెయిన్ హీరోయిన్ అయిపోతుంది. అంతేకాదు ప్రేక్షకులని ఈ కొత్తమ్మాయి విశేషంగా ఆకర్షిస్తోంది. మెయిన్ హీరోయిన్ అనుకున్న రుక్షర్ దిల్లోన్ పెద్దగా రిజిస్టర్ అవలేదు. దీంతో హిట్టు కొట్టినా లాభం లేకుండా పోయిందే అని తెగ ఫీల్ అవుతుందట.