అఖిల్ కు ఇంటిపోరు తప్పేలా లేదుగా

Samantha Naga Chaitanya Akhil akkineni
Samantha Naga Chaitanya Akhil akkineni

Samantha Naga Chaitanya Akhil akkineni | సమంత, నాగ చైతన్య విడాకుల తరువాత ఎవరి దారిలో వారు కెరీర్ పై దృష్టి సారించారు. సమంత కొంచెం డోస్ పెంచటమే కాక బోల్డ్ రోల్స్ తో రెచ్చిపోతుంది. మరోపక్క విడాకుల తరువాత అక్కినేని ఫ్యామిలీ కి బాగా కలిసొచ్చినట్టుంది. లవ్ స్టోరీ తో నాగ చైతన్య, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో అఖిల్, బంగార్రాజు తో నాగార్జున ఓ మోస్తరు హిట్లు అందుకున్నారు. ఇక అసలు విషయానికి వస్తే …. సమంత నటించిన ‘యశోద’ సినిమా ఆగస్టు 12 న విడుదలకు సిద్ధమైంది. దానికి ఒకరోజు ముందే 11 న నాగ చైతన్య, అమిర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ విడుదల కానుంది. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద సమంత, నాగ చైతన్య క్లాష్ అవటం చర్చనీయాంశమైంది. మరో ట్విస్ట్ ఏమిటంటే అఖిల్ ‘ఏజెంట్’ సినిమాను కూడా ఆగష్టు 11 నే విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. సో, ఆగస్టు రెండోవారం బాక్స్ ఆఫీస్ పోరు రంజుగా ఉండబోతుంది అనమాట.

Samantha Naga Chaitanya Akhil akkineni