పాప బాగా పెంచటమే కారణమా

Pragya Jaiswal remuneration | అందాల ఆరబోతకు అస్సలు వెనుకాడని టాలీవుడ్ హీరోయిన్లలో ప్రగ్యా జైస్వాల్ ముందు వరసలో ఉంటుంది. అయితే ఈమెకు ఎందుకనో అవకాశాలు కరువయ్యాయి. బహుశా క్రిష్ కంచె ఆమెకు వేసిన క్లాస్ ముద్ర ఇంకా చెరిగిపోయినట్టు లేదు. సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ హాట్ ఫోజులతో దుమ్ములేపే ఈ అమ్మడు, దర్శక నిర్మాతలకు ఇండైరెక్ట్ గా దేనికైనా రెడీ అనే సందేశాలిచ్చినా ఉపయోగం ఉండట్లేదు. అయితే అనూహ్యంగా అనుకోని అవకాశాన్ని అఖండ తో అందిపుచ్చుకుంది ప్రగ్యా జైస్వాల్.

అఖండ పేరుకి తగ్గట్టే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఒక్కసారిగా ప్రగ్యా జైస్వాల్ లైం లైట్ లోకి వచ్చేసింది. ఒకరకంగా సీనియర్ హీరోలకు బెస్ట్ ఛాయస్ అయిపోయిందని చెప్పచు. సౌత్ లో సీనియర్ హీరోలకు కొదువే లేదు. అఖండ క్రేజ్ తో కొత్తగా అమ్మడు కోటి రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుంది. అందుకేనేమో అఖండ తో వచ్చిన అడ్వాంటేజ్ కూడా లేకుండా పోయింది. వచ్చిన ఒకటి రెండు ఆఫర్లు రెమ్యునరేషన్ డిమాండ్ చేసి పోగొట్టుకుంది. ప్రస్తుతం అమ్మడిని ఎవరూ పట్టించుకోవటం లేదని ఫిలిం నగర్ టాక్.