Ram gopal varma Dangerous | ఒకప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ లలో మంచి టాలెంటెడ్ దర్శకుడిగా పేరున్న రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య కాలంలో కేవలం బూతు సినిమా దర్శకుడిగా మారిపోయాడు. ఆర్జీవీ నుంచి వస్తున్న బూతు వరుసలో తాజా చిత్రం డేంజరస్. లెస్బియన్ లవ్, క్రైమ్ అండ్ యాక్షన్ మూవీ అంటూ ప్రమోషన్ ఊదర గొట్టడమే కాక చిత్ర విచిత్రమైన ప్రచార టెక్నీక్కులు వాడుతున్నాడు వర్మ. ఈ సినిమాలో ఓ హీరోయిన్ అయిన నైనా గంగూలీ సోషల్ మీడియాలో ఓ నీలి చిత్రాన్ని పోలిన వీడియో వదిలారు ప్రమోషన్ కోసం. మరో రెండు రోజుల్లో సినిమా విడుదలవుతుందనగా ఈ వీడియో వదలటం వర్మ జిమ్మిక్కులో భాగమే. అయితే అనూహ్యంగా నట్టి కుమార్ కోర్టును ఆశ్రయించి ఈ సినిమా విడుదలను అడ్డుకున్నాడు.
కింది కోర్ట్ ఇచ్చిన ఇంజెక్షన్ ఆర్డర్ ను హైకోర్టు కొట్టేసింది. దీంతో సినిమా విడుదల అడ్డంకులు తొలగిపోయాయి. మే 6 న సినిమా విడుదల చేయనున్నట్టు వర్మ ఇప్పటికే ప్రకటించాడు. ఇండియా లో మొట్టమొదటి లెస్బియన్ మూవీ అంటూ వర్మ ప్రచారం చేసుకుంటున్నాడు. ఇండియాలో ఆ కాన్సెప్ట్ వర్కౌట్ అవుతుందా అనేది అనుమానమే. వర్మ జిమ్మిక్కులతో ఎలాగోలా కుర్రకారుని థియేటర్ వరకు అయితే రప్పించగలడు. ఆ తరువాత మౌత్ టాక్ మీద సినిమా భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.