కియారా అద్వాని బ్రేకప్ కహాని

Kiara Advani Breakup story | ఫుగ్లీ అనే డిజాస్టర్ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది హాట్ బ్యూటీ కియారా అద్వాని. ఆ తరువాత రెండేళ్ళకి ధోని బయోపిక్ తో మొదటి హిట్ అందుకుంది కియారా. మరో రెండేళ్ళకి ‘లస్ట్ స్టోరీస్’ తో బాగా పాపులర్ అయి పోయింది. అదే సమయంలో మహేష్ బాబు సరసన వసుమతి గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేసి హిట్ అందుకుంది. అప్పటి వరకు బాగానే ఉన్నా, రామ్ చరణ్ సినిమాతో భారీ డిజాస్టర్ అందుకుని టాలీవుడ్ కి అప్పుడు దూరమైంది. పైగా బాలీవుడ్ లో బిజీ అయిపోవడంతో మళ్ళీ టాలీవుడ్ వైపు చూడలేదు. తాజాగా శంకర్ రామ్ చరణ్ సినిమాతో మరోసారి టాలీవుడ్ లో రీఎంట్రీ ఇస్తోంది. ఇక అసలు విషయానికి వస్తే….

టాలీవుడ్ కు దూరమై ముంబై చెక్కేసిన కియారా అద్వాని, బాలీవుడ్ యువ నటుడు సిద్దార్థ్ మల్హోత్రా తో ప్రేమలో పడి లోకమంతా చుట్టేసింది. మరో విశేషమేమిటంటే వీరిద్దరూ డేటింగ్ లో మునిగితేలక ముందు కనీసం కలిసి సినిమా కూడా చేయలేదు. అలాంటిది వీరిద్దరూ ఎలా కలిశారనేదే ఓ మిస్టరీ. దానికి సమాధానమే కరణ్ జోహార్ పార్టీల కల్చర్. కియారా సిద్దార్థ్ పెళ్లి కూడా త్వరలో చూడబోతున్నాం అనుకుంటున్న సినీ జనాలకి తాజా వార్తలు షాక్ లా తగిలాయి. వీరిద్దరి మధ్య అభిప్రాయం బేధాలు వచ్చాయని, బ్రేకప్ అయ్యారని ముంబైలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయాన్నీ కియారా కానీ, సిద్దార్థ్ కానీ ధృవీకరించాల్సి ఉంది.

Kiara Advani Breakup story