Ravi teja Ramarao on duty | గతేడాది క్రాక్ తో భారీ హిట్ కొట్టి మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కిన రవితేజ వరుస సినిమాలతో స్పీడ్ పెంచేసిన విషయం తెలిసిందే. ఈ సంవత్సరం ఖిలాడీతో డిజాస్టర్ ఎదురైనా రవితేజ స్పీడ్ ఏమాత్రం తగ్గలేదు. చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న రవి తేజ తదుపరి చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. కొత్త డైరెక్టర్ శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా షూటింగ్ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమాలో రవితేజ దివ్యాన్షా కౌశిక్, రజిషా విజయన్ లతో జతకట్టాడు. అలాగే హీరో వేణు తొట్టెంపూడి ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నాడు. ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలు కూడా జోరుగా సాగుతున్నాయి. తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా ‘సొట్ట బుగ్గల్లో’ లిరికల్ సాంగ్ విడుదల చేసారు.
ప్రక్రుతి అందాల మధ్య దివ్యాన్షా కౌశిక్, రవి తేజ లపై తెరకెక్కించిన రొమాంటిక్ మెలోడీ ఫ్యాన్స్ ని బాగా ఆకర్షిస్తోంది. అయితే రవితేజ లిప్ లాకుల సెంటిమెంట్ ఫ్యాన్స్ ను భయపెడుతుంది. గతంలో కిక్ 2 లో రకుల్ తో లిప్ లాక్, ఖిలాడీలో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి తో లిప్ లాకులు బాగా వైరల్ అయ్యాయి. అలాగే పవర్ సినిమాలో రెజినా తో కూడా పెదవి తాంబూలం అందుకున్నాడు రవి తేజ. ఈ సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇప్పుడు ఇదే సెంటిమెంట్ ‘రామారావు ఆన్ డ్యూటీ’ లో కూడా క్యారీ అవుతుందేమో అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.