Sarkaru vaari paata review, SVP Movie review | సూపర్ స్టార్ మహేష్ బాబు రెండేళ్ల క్రితం ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు. ఆ సమయంలోనే పెద్దగా లేట్ చేయకుండా పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ కమిట్ అయ్యాడు. అయితే రకరకాల కారణాల వలన సినిమా బాగా ఆలస్య మయింది. కరోనా మూడు సార్లు ఈ సినిమాకు దెబ్బకొట్టింది. కరోనా తదనంతర పరిస్థితులు కూడా సినిమా ఆలస్యానికి కారణమయ్యాయి. ఈ సినిమా ఎట్టకేలకు ఈ నెల 12 న విడుదల అయింది.. మహేష్ తో మొదటిసారిగా కీర్తి సురేష్ జతకట్టింది. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ ఇదే. అలాగే కరోనా తరువాత బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేస్తున్న చివరి భారీ సినిమా కూడా ఇదే కావటం విశేషం. సర్కారు వారి ప్రీరిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది.
SVP movie pre-release business
నైజాం : 36 Cr
సీడెడ్ : 14 Cr
ఉత్తరాంధ్ర : 13 cr
ఈస్ట్ : 8.5 cr
వెస్ట్ : 7.2 cr
గుంటూరు : 8.5 Cr
కృష్ణ : 7.5 Cr
నెల్లూరు : 3.8 Cr
AP-TG Total:-98.5 CR
కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా: 10 Cr
ఓవర్సీస్ : 11 Cr
Total World Wide: 119.5 cr
అంటే దాదాపుగా 121 కోట్ల టార్గెట్ తో సూపర్ స్టార్ మహేష్ బాబు బాక్స్ ఆఫీస్ వేట మొదలుపెట్టనున్నాడు అనమాట. చిరంజీవి ఆచార్య తో సహా బడా చిత్రాల రన్ ఇప్పటికే పూర్తవటంతో సర్కారు వారి పాట కు పోటీ లేకుండా పోయింది. ఇప్పుడు కేవలం ఇదే అంశం సర్కారుకు కలిసొచ్చేలా ఉంది. నిన్న విడుదలైన ఈ సినిమా యుఎస్ లో ప్రీమియర్స్ తోనే దాదాపు గా మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అయితే టాక్ మాత్రం కొంచెం తేడాగా ఉంది. దీనికి అనేక కారణాలున్నాయి. ముందుగా సినిమా ఎలా ఉందొ చూద్దాం.
Sarkaru vaari paata review, SVP Movie review
అమెరికాలో మహేష్ చేబదులిచ్చి వడ్డీలు వసూలు చేస్తుంటాడు. అప్పుగా ఇచ్చిన డబ్బులు, వడ్డీ వసూలు చేయడం కోసం ఎంత దూరమైనా వెళ్లే అలవాటున్న మహి [మహేష్] కీర్తి సురేష్ కు డబ్బు అప్పుగా ఇస్తాడు. ఆమె డబ్బులు ఎగ్గొట్టటమే కాకుండా, ఆమె తండ్రి మహేష్ ను బెదిరిస్తాడు. ఆ డబ్బులేవో ఆమె తండ్రి దగ్గరే వసూలు కోవటానికి మహేష్ వైజాగ్ వస్తాడు. డబ్బులు వసూలు చేశాడా లేదా అనేది సినిమా కథ.
ఎప్పట్లానే సినిమాలో మహేష్ బాబు నటన అద్భుతం. కీర్తి సురేష్ కూడా ఊహించిన దాని కన్నా బాగానే నటించింది. వీరిద్దరి కెమిస్ట్రీ కి కూడా మంచి మార్కులే పడ్డాయి. ఫస్ట్ హాఫ్ అంటా కామెడీ మీద నెట్టుకొచ్చినా, సెకండ్ హాఫ్ మాత్రం సాగదీసినట్టుందనేది ఎక్కువమంది అభిప్రాయం. ఇక ఈ సినిమాకు మొదటి ఆట పడకముందే, యుఎస్ నుంచే నెగటివ్ టాక్ మొదలైపోయింది. #DisasterSvp అనే హాష్ టాగ్ ట్విట్టర్ లో టాప్ లో ట్రెండ్ అవుతుందంటే ఆశ్చర్య పడాల్సిన అంశమే. వివాదాలకు ఎప్పుడూ దూరంగా ఉండే మహేష్ బాబు ఈసారి ఎందుకో తన వ్యక్తిత్వానికి భిన్నంగా వ్యవహరించినట్టు కనిపిస్తుంది.
డైరెక్టర్ వైఎస్ పై చేసిన వ్యాఖ్యలు, కొన్ని వివాదాస్పద డైలాగులు, మహేష్ కూడా జగన్ కు అనుకూలంగా చేసిన కామెంట్లు సినిమాపై వ్యతిరేకతను బాగా పెంచేసాయంటున్నారు ట్రేడ్ ఎక్సపెర్టులు. వీటికి తోడు మెగా ఫాన్స్ కావాలని నెగటివ్ స్ప్రెడ్ చేసారని కూడా కొందరి నోట వినిపిస్తుంది. ఇందులో నిజమెంతో మనకు తెలియదు కానీ, సినిమాలో విషయం ఉంటే ఎంత నెగటివ్ స్ప్రెడ్ చేసినా ఏమి కాదు. రివ్యూలు కూడా సినిమాకు పెద్దగా హెల్ప్ కాలేదు. అయితే మహేష్ స్టామినాతో ఈ నాలుగు రోజులు భారీగా కలెక్ట్ చేయటం ఖాయం. వీక్ డేస్ లో కూడా పోటీ లేదు కనుక బ్రేక్ ఈవెన్ కు పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చని ప్రస్తుతానికి ట్రేడ్ అనలిస్ట్ ల అభిప్రాయం.
సోమవారం ఈ సినిమా భవితవ్యం తేలిపోనుంది. మహేష్ కెరీర్ లో యుఎస్ ప్రీమియర్స్ రికార్డు ఇప్పటికే బ్రేక్ అయింది. సినిమా అంతా వన్ మ్యాన్ షో కావటంతో మహేష్ ఫ్యాన్స్ మల్లెమళ్ళీ చూసే అవకాశం ఉంది. ఫైనల్ గా ఇది కేవలం ఫ్యాన్స్ సినిమా.